పవన్‌కళ్యాణ్.. సేమ్ స్టోరీ రిపీట్
May 20th, 2015, 07:00 AM IST
పవన్‌కళ్యాణ్ 'గబ్బర్‌సింగ్ 2' షూటింగ్ ఈ నెలాఖరులో మొదలు కావడం ఖాయమని కొందరు బల్ల గుద్ది మరీ చెప్పారు. కళ్యాణ్ కూడా పెంచిన గడ్డం తీసేసి... షూటింగ్‌కి రెడీ అన్నట్టుగా తయారయ్యాడు. ఇక పవర్‌స్టార్ మూవీ సెట్స్ మీదకి వెళ్లడమే తరువాయి అనుకుంటూ ఉండగా మళ్లీ కథ మొదటికి వచ్చింది. మరోసారి పవన్‌కళ్యాణ్‌కి పొలిటికల్ ఫీవర్ సోకింది. భూ సేకరణని వ్యతిరేకిస్తోన్న పవన్ రైతుల తరఫున పోరాటం చేయాలని నిర్ణయించుకున్నాడు. దీంతో గబ్బర్‌సింగ్ 2 సెట్స్ మీదకి వెళ్లడం మరింత లేట్ కావచ్చునని సినీ వర్గాల్లో చెప్పుకుంటున్నారు.
ఇప్పుడు షూటింగ్ మొదలు పెట్టి సంక్రాంతికి ఈ చిత్రం రిలీజ్ చేయాలనేది పవన్‌కళ్యాణ్ ప్లాన్. అయితే చిరంజీవి 150వ చిత్రాన్ని సంక్రాంతికే రిలీజ్ చేయాలని ఫిక్స్ అవడంతో పవన్ సినిమా అప్పటికి రాదని తేలిపోయింది. సంక్రాంతి మిస్ అయితే సమ్మర్‌లోనే రిలీజ్ చేయాలి కాబట్టి పవన్ ఇంకొంత కాలం రాజకీయాలపై దృష్టి పెట్టి... ఈ రైతుల సమస్యని ఒక కొలిక్కి తెచ్చే ప్రయత్నం చేస్తాడట. కాబట్టి పవర్‌స్టార్‌ని తిరిగి యాక్షన్‌లో చూడాలని కోరుకుంటోన్న అభిమానులు కొన్ని రోజుల పాటు న్యూస్ ఛానల్స్‌లో పవన్‌ని చూడ్డంతోనే సరిపెట్టుకోవాలి.
See more at: http://musicgullye.blogspot.in/

0 comments:
Post a Comment