సూపర్‌స్టార్‌తో ఇంత రిస్కు అవసరమా?

సూపర్‌స్టార్‌తో ఇంత రిస్కు అవసరమా?

May 20th, 2015, 10:00 AM IST

రజనీకాంత్‌ ఇమేజ్‌కి తగ్గ సినిమాలు తీయలేక సీనియర్‌ దర్శకులే చతికిల పడుతుంటే... కీలకమైన టైమ్‌లో రజనీకాంత్‌ని మెప్పించే కథ చెప్పి ఆయనని డైరెక్ట్‌ చేసే రేర్‌ ఛాన్స్‌ కొట్టేసాడు యువ దర్శకుడు రంజిత్‌. పెద్ద పెద్ద దర్శకులే రజనీని మెప్పించలేకపోతోంటే రంజిత్‌ సింగిల్‌ సిట్టింగ్‌లో స్టోరీ ఓకే చేసుకుని వచ్చాడు. ఇందులో రజనీకాంత్‌ మాఫియా డాన్‌గా కనిపిస్తాడట. గాడ్‌ఫాదర్‌ తరహా గ్యాంగ్‌స్టర్‌ డ్రామా అయిన ఈ చిత్రంలో హీరోయిజం పరవళ్లు తొక్కుతుందట. తన అభిమానులు పండగ చేసుకునే సీన్లు ఉండడంతోనే రజనీ అంత త్వరగా ఈ చిత్రాన్ని ఓకే చేసారట. పైగా దీనిని చాలా వేగంగా తీస్తానని రంజిత్‌ మాట ఇచ్చాడట. విశేషం ఏమిటంటే ఇందులో రజనీకాంత్‌ సరసన హీరోయిన్‌ ఉండదట. బిగ్గెస్ట్‌ కమర్షియల్‌ హీరో అయిన రజనీకాంత్‌ సరసన హీరోయిన్‌ లేకపోవడమంటే మామూలు రిస్క్‌ కాదుగా! హీరోయిన్‌ లేదంటే పాటలకి కూడా స్కోప్‌ ఉండదు. రజనీకాంత్‌పై ఇంతటి ప్రయోగం చేయడానికి ఇంతకుముందు ఎవరూ సాహసించలేదు. మరి ఫ్లాపుల్లో ఉన్న టైమ్‌లో రజనీ చేస్తోన్న ఈ రిస్కు ఎంత వరకు పే చేస్తుందనేది వేచి చూడాలి.
See more at: http://musicgullye.blogspot.in/
Share on Google Plus

About Guna

    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment

All Time Entertainment