రాజమౌళి షాకింగ్ సర్‌ప్రైజ్
May 7th, 2015, 06:07 AM IST
బాహుబలి ప్రమోషన్ క్యాంపైన్‌లో భాగంగా ఈ చిత్రం పోస్టర్లు ఒక్కొక్కటీ విడుదల చేస్తోన్న సంగతి తెలిసిందే. శివలింగాన్ని మోసుకొస్తున్న ప్రభాస్ స్టిల్ సంచలనం సృష్టించింది. ఇప్పుడు ఇందులోని హీరోయిన్ అనుష్క స్టిల్ రిలీజ్ చేసారు. అనుష్క గెటప్, ఆ లుక్ చూస్తే ఎవరైనా షాక్ అవుతారు. అనుష్క స్టిల్ అంటే ఆమె రాణి గెటప్‌లో ఉన్న స్టిల్ వదులుతారని అనుకుంటే... యుద్ధ ఖైదీగా ఉన్న స్టిల్ రిలీజ్ చేసి రాజమౌళి సర్‌ప్రైజ్ చేసాడు. బాహుబలి మొదటి భాగంలో అనుష్క చేస్తున్న 'దేవసేన' పాత్ర కాసేపే కనిపిస్తుందట. అది కూడా ఇదే గెటప్‌లో ఉంటుందట. కాబట్టి అనుష్క అందాన్ని ఆరాధించే అభిమానులంతా బాహుబలి రెండవ భాగం కోసం వేచి చూడక తప్పదన్నమాట. ఏళ్ల తరబడి బందీగా ఉండి, హింసకి గురైన దేవసేన 'నిప్పులే శ్వాసగా' బ్రతుకుతోందంటూ రాజమౌళి తన హీరోయిన్‌ని పరిచయం చేసాడు. బాహుబలి నెక్స్‌ట్ స్టిల్‌లో రాణాని చూడవచ్చు. మే 31న ట్రెయిలర్ విడుదల చేసేలోగా ఇలా ఒక్కో పాత్రని పరిచయం చేయబోతున్నారు.
See more at: http://musicgullye.blogspot.in/

0 comments:
Post a Comment